చెరువుల మరమ్మతులు చేపట్టాలి
ఇబ్రహీంపట్నం రూరల్: చెరవులు, కుంటల్లో నీరు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వాటి మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర మత్స్యకారుల, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొరెంకల నర్సింహ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మండల పరిధిలోని రాయపోల్‌లో ముదిరాజ్ సంఘం కార్యాలయం వద్ద మత్స్యకారుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ.. చెరువు నిండినా.. లీకేజీల వల్ల నీరు బయటకు పోతోందన్నారు. దీంతో మత్స్యకారు వృత్తి దారులు ఆగమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.10 లక్షలు బడ్జెట్ కేటాయించి చెరువుల్లో కంప చెట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యం వల్ల మత్స్య సంపద చనిపోతే ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా మత్స్యకారులకు 50 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్, రాయపోల్ సొసైటీ అధ్యక్షుడు మైలారం యాదయ్య, కార్యదర్శి రమేష్, పుల్లయ్య, మండల నాయకులు సురేందర్ పాల్గొన్నారు.
టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహ
Comments
Please login to add a commentAdd a comment