ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
శంషాబాద్ రూరల్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన ఎంస్‌ఎంఈ ఔట్‌రీచ్ క్యాంపులతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు నూతన శక్తిని ఇస్తుందని జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ ఎం.శ్రీలక్ష్మీ అన్నారు. బ్యాంకు సైఫాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో మండలంలోని ముచ్చింతల్‌లో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్టు ఆవరణలో బుధవారం మెగా ఎంఎస్‌ఎంఈ ఔట్‌రీచ్ క్యాంపు నిర్వహించారు. ఎంస్‌ఎంఈ ఉత్పాదనలపై బ్యాంకు ఖాతాదారులకు అవగాహన కల్పించారు. సుమారు రూ. వంద కోట్లకు సంబంధించిన రుణ మంజూరు పత్రాలను 50 మంది ఖాతాదారులకు అందజేశారు. ఎంఎస్‌ఎంఈ సెక్టార్ రుణాలు దేశంలో 30 శాతం జీడీపీతో దేశానికి వెన్నుముకంగా ఉన్నామని ఎంఎస్‌ఎంఈ వెర్టికల్ సీఓ ముంబయి జనరల్ మేనేజర్ జి.కె.సుధాకర్‌రావు అన్నారు. వివిధ రకాల ఉత్పత్తుల తయారీ రంగంలో 45 శాతం వాటాతో పాటు దేశంలో 65 శాతంపైగా యువతకు జీవనోపాధి కల్పిస్తుందన్నారు. ఇలాంటి మెగా క్యాంపులను దేశంలోని 157 కేంద్రాల్లో మార్చి 3 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాంకు హైదరాబాద్ జనరల్ మేనేజర్ ఆర్.ఎల్.పట్నాయక్, డీజీఎం సోనాలిక, ఏజీఎంలు రవి, జగదీశ్, లేపాక్షి తదితరులు పాల్గొన్నారు.
మెగా ఎంఎస్‌ఎఈ క్యాంపులో రుణాల అందజేత
Comments
Please login to add a commentAdd a comment