
దైవభక్తి అలవర్చుకోవాలి
● స్పీకర్ ప్రసాద్‌కుమార్
మోమిన్‌పేట: స్వామివారిని దర్శించుకుంటున్న స్పీకర్ ప్రసాద్‌కుమార్ తదితరులు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ మాధవానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనించాలన్నారు. భక్తితోనే ముక్తి లభిస్తుందన్నారు. సమాజ హి తం కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మహిపాల్‌రెడ్డి, ముత్తాహర్ షరీఫ్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ రమేష్‌కుమార్, డీసీసీబీ డైరక్టర్ కిషన్‌నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి,నాయకులు మల్‌రెడ్డి, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జునస్వామిఆలయంలో..
మోమిన్‌పేట: ప్రతి ఒక్కరూ దైవభక్తి అలవర్చుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం మోమిన్‌పేట మండలం దుర్గంచెర్వు గ్రామంలోని భ్రమారాంబిక మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తితో మానసిక ప్రశాంతత పొందవచ్చని తెలిపారు. ఆయన వెంట మర్పల్లి మార్కెటు కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, నాయకులు నరోత్తంరెడ్డి, శ్రీనివాస్, వెంకటేశం తదితరులు ఉన్నారు.
విద్యార్థినికి న్యాయం జరిగేలా చూస్తాం
అనంతగిరి: ఉపాధ్యాయుల తీరు కారణంగా భవనం పైనుంచి దూకి గాయపడిన బాలిక తబితను బుధవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ పరామర్శించారు. ఇటీవల కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మహిళా టీచర్లు విద్యార్థి తబితను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. బుధవారం వికారాబాద్ ఆస్పత్రికి వచ్చిన బాలికను స్పీకర్ పరామర్శించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థినికి ధైర్యం చెప్పారు.

దైవభక్తి అలవర్చుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment