కంది పంట అగ్నికి ఆహుతి
షాద్‌నగర్: ఓ రైతు వేసిన కంది పంట అగ్నికి ఆహుతయింది. ఈ ఘటన గురువారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కొండన్నగూడలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పాపయ్య యాదవ్ తన వ్యవసాయ పొలంలో నాలుగు ఎకరాల్లో కంది పంట వేశాడు. పక్క పొలంలో రైతు పొలాన్ని చదును చేసి వ్యర్థాలకు నిప్పటించాడు. అగ్గి రవ్వలు ఎగిసి పడి కందిపంటకు నిప్పంటుకుంది. గమనించిన రైతులు మంటలార్పేందుకు యత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో పంటమొత్తం అగ్నికి ఆహుతయింది. దీంతో సుమారు రూ.1.50లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment