
నిజాయతీ చాటిన ఆర్టీసీ ఉద్యోగులు
పరిగి: బస్సులో మరచిపోయిన బ్యాగును తిరిగి అప్పగించి నిజాయతీ చాటుకున్నారు పరిగి ఆర్టీసీ ఉద్యోగులు. ఈనెల 7వ తేదీన రాత్రి పరిగి నుంచి హైదారాబాద్‌కు ఆర్టీసీ బస్సు బయలు దేరింది. అందులో దినేష్ జైన్ అనే ప్రయాణికుడు తన బ్యాగును మరిచి మొయినాబాద్‌లో దిగిపోయాడు. దీంతో కండక్టర్ వెంకటయ్య, డ్రైవర్ సుధాకర్‌లు బ్యాగును గమనించగా.. అందులో రూ.లక్ష నగదు ఇతర పేపర్లు ఉండటంతో ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ అధికారులకు అందజేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు విచారించిన అధికారులు పోలీసుల సమక్షంలో బాధితుడికి నగదుతో ఉన్న బ్యాగును సోమవారం అందజేశారు. విధుల్లో నిజాయతీని చాటుకున్న ఉద్యోగులను డీఎం కరుణశ్రీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment