
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
నవాబుపేట: మండలంలోని చించల్ పేట గ్రామంలో ఊరడమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, నాయకులు అశోక్, శంకరయ్య, అనంతరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అడవికి నిప్పు
దుద్యాల్: మండల పరిధిలోని రోటిబండ తండా సమీపంలోని అడవికి గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం నిప్పు పెట్టారు. లగచర్ల నుంచి రోటిబండ తండాకు వెళ్తున్న మార్గంలో పల్లె ప్రకృతివనం దగ్గరలోని పొలాలను అనుకుని సాధారణ అడవి ఉంది. పంటల కాలం పూర్తవ్వడంతో పంటల వ్యర్థాలు, పిచ్చిగడ్డి పూర్తిగా ఎండిపోయింది. దీంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అగ్గి రాజుకుంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ప్రజలు నిస్తూరంగా చూస్తున్నారే తప్పా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సంబంధిత అధికారులు అడవులపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
కుల్కచర్ల: తాళం వేసిన ఇంట్లో చోరీ చేసిన ఘటన కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల గ్రామానికి చెందిన అమీనా బేగం నగరంలోని ఉప్పల్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గ్రామానికి వచ్చిన ఆమె ఈ నెల 10న ఉప్పల్‌లో రంజాన్ కానుకగా కుట్టు మిషన్లు ఇస్తున్నారని తెలిసి ఈ నెల 9న కూతురు ఆసియాను తీసుకొని నగరానికి వెళ్లింది. అయితే కుట్టు మిషన్ల పంపిణీ వాయిదా పడటంతో కూతుర్ని 10వ తేదీ కుల్కచర్లకు పంపింది. ఆసియా గ్రామానికి వచ్చి చూడగా ఇంటి, బీరువా తాళాలు పగు లగొట్టినట్లు గుర్తించి తల్లికి ఫోన్ ద్వారా తెలియజేసింది. మంగళవారం అమీనా బేగం గ్రా మానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటిలో ఉన్న తులం బంగారం, 20 తులా ల వెండి చోరీకి గురైనట్లు ఫిర్యాదు పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అన్వేష్ రెడ్డి తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న కలప లారీ సీజ్
దోమ: అక్రమంగా తరలిస్తున్న కలప లారీని ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. మంగళవారం దోమ మండల పరిధిలోని గుండాల గ్రామ సమీపంలో కొందరు వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కలప తరలిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ఘటన స్థలానికి వెళ్లిన ఫారెస్ట్ అఽధికారులు లారీకి సంబంధించిన పత్రాలను సమర్పించాలని కోరారు. ఈ క్రమంలో వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో లారీని సీజ్ చేసి ఫారెస్ట్ కార్యాలయానికితరలించారు. ఈ కార్యక్రమంలో కుల్కచర్ల సెక్షన్ ఆఫీసర్ మైనోద్దీన్, బీట్ ఆఫిసర్ భీమ్లా, సిబ్బంది బాబు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

ఘనంగా ఆలయ వార్షికోత్సవం
Comments
Please login to add a commentAdd a comment