విద్యార్థుల సామర్థ్యం పరిశీలన
కొడంగల్ రూరల్: జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు ఎంపిక చేసిన పాఠశాలల్లో రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. మంగళవారం మండల పరిధిలోని హుస్సేన్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ టీమ్ జైన్ డైట్ ఫీల్డ్ ఇన్వెస్ట్రిగేటర్ మమత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఎన్‌సీఈఆర్‌టీ చేపట్టిన అధ్యయనం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యాయన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 50 ప్రభుత్వ పాఠశాలల్లో మూడు రోజులపాటు సర్వే కొనసాగుతుందన్నారు. లోపాలను గుర్తిస్తూ ప్రణాళికల రూపకల్పనకు సర్వే వేదికవుతుందన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన ప్రశ్నావళి ఆధారంగా ఫీల్డ్ ఇన్వెస్ట్రిగేటర్స్ విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తూ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలను చదవడం, రాయడం, అక్షరాలు, అంకెలు గుర్తించడం, అవగాహన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారన్నారు. 10వ తేదీన తెలుగు, 11న ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించిన సర్వే పూర్తయ్యిందని తెలి పారు. 12వ తేదీన గణితం సబ్జెక్టుకు సంబంధించి సర్వే నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం క్రాంతికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment