
వర్గీకరణ చేపట్టే వరకు పోరాటం
ఆమనగల్లు: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పోతుగంటి కృష్ణమాదిగ అన్నారు. వర్గీకరణ చేపట్టే వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలనే డిమాండ్‌తో చేపట్టిన దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరాయి. దీంతదీక్షలో కిశోర్‌కుమార్‌మాదిగ, సురేశ్, విజయ్‌కుమార్, సాయి, విజేందర్, మహేశ్, సచిన్, పవన్‌లు కూర్చున్నారు. ఈ సందర్భంగా పి.కృష్ణమాదిగ మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా పోరాడుతున్నా వర్గీకరణ చట్టబద్దత కల్పించకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నారాయణ, కుమార్, శ్రీను, మహేశ్, సురేశ్, బాలరాజు, శ్రీకాంత్, కృష్ణ, శివ, నర్సింహ, కుమ్మరసంఘం నాయకులు నాగేశ్, బాలకృష్ణ, రమేశ్, తిరుపతి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పి.కృష్ణమాదిగ
Comments
Please login to add a commentAdd a comment