
ప్రభుత్వ చొరవతోనే అభివృద్ధి
చేవెళ్ల: మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని భారత జాతీయ మహిళా సమాఖ్య(ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల అన్నారు. గురువారం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో మున్సిపల్ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనభాలో సగభాగం ఉన్న మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను సైతం అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 20శాతం మహిళలు పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనతతో భాదపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య నాయకురాలు వెంకటమ్మ, నాయకురాళ్లు లలిత, విజయమ్మ, రమాదేవి, వినోద, సుగుణమ్మ, అంజమ్మ, జయమ్మ, యాదమ్మ, రాములమ్మ, చంద్రకళ, సీపీఐ నాయకులు కె. రామస్వామి, వడ్ల సత్యనారాయణ, బాబురావు, యాదగిరి, శ్రీకాంత్, పెంటయ్య, తదితరులు ఉన్నారు.
ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల
Comments
Please login to add a commentAdd a comment