గ్రూపు–3లో మెరిసిన గిరిపుత్రుడు
మహేశ్వరం: ఉద్యోగం చేస్తూనే ఉన్నత స్థాయికి వెళ్లాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదివాడా యువకుడు. పేద కుటుంబంలో పుట్టి గ్రూప్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి సత్తా చాటాడు. మహేశ్వరం మండలం పెద్దమ్మ తండా గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న నల్లచెర్వు తండాకు చెందిన కాట్రావత్ దేవేందర్ నాయక్ శుక్రవారం వెల్లడించిన గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో శంషాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
సంతోషంలో తల్లిదండ్రులు
ఇటీవల విడుదలైన గ్రూప్–2, గ్రూప్–1, గ్రూప్–3 ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనబర్చాడు. అంతకుముందు గ్రూప్–2 ఫలితాల్లో జోనల్ ఎస్టీ కేటగిరిలో 2వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 171వ ర్యాంకు సాధించాడు. గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో 433 మార్కులు సాధించారు. గ్రూప్–3 పరీక్ష ఫలితాల్లో ఎస్టీ కేటగిరిలో 2వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు సాధించి మెరిశాడు. దీంతో ఏదైనా ఉన్నత ఉద్యోగం తమ కుమారుడికి వస్తుందని దేవేందర్‌నాయక్ తల్లిదండ్రులు లక్ష్మి, రాములు నాయక్ సంతోష పడుతున్నారు.
రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు
Comments
Please login to add a commentAdd a comment