
అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత
కేసు నమోదు చేసిన పోలీసులు
మాడ్గుల: బెల్ట్‌షాప్‌లో విక్రయిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు మండల కేంద్రంలోని అంబాల యాదయ్యకు చెందిన మణికింఠ కిరాణం, ఈర్ల శ్రీనివాస్‌కు చెందిన జై హనుమాన్ కిరాణం, నాగిళ్ళ గ్రామంలోని అగిర్ చంద్రశేఖర్ కిరాణం దుకాణల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రూ.50వేల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రూ.6 వేల విలువ..
యాచారం: అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలివీ.. మండల పరిధిలోని తమ్మలోనిగూడలో రాములు అనే వ్యక్తి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు శుక్రవారం యాచారం పోలీసులు వెళ్లి దుకాణంలో తనిఖీ చేయగా రూ.6 వేల విలువ జేసే లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment