
నేటి నుంచి ఒంటిపూట బడులు
బొంరాస్‌పేట: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి(శనివారం) ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాలల నిర్వహణ సమయంలో మార్పులు జరిగాయి.
‘పది’కి మినహాయింపు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరగనున్నాయి.
21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు
జిల్లాలో ఈ ఏడాది 12,901 మంది విద్యార్థు లు పదో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10,074మంది, ప్రైవేట్ స్కూళ్లలో 2,827 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఐదు నెలలుగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. అప్పటికే అధికారులు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు.
ఒంటిపూట బడుల సమయపాలన
జాగ్రత్తగా ఉండాలి
ఎండలు ముదురుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠశాలల్లో విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నాం. శనివారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభవుతాయి. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి.
– రేణుకాదేవి, డీఈఓ
● ఉదయం 8గంటలకు పాఠశాలలు ప్రారంభం
● ఉదయం 8.05 నుంచి 8.15 వరకు ప్రార్థన
● 8.15 – 8.55 వరకు ఒకటో పిరియడ్
● 8.55 – 9.35 వరకు రెండో పిరియడ్
● 9.35 – 10.15 వరకు మూడో పిరియడ్
● 10.15 – 10.30 వరకు స్వల్ప విరామం
● 10.30 – 11.10 వరకు నాల్గో పిరియడ్
● 11.10 – 11.50 వరకు ఐదో పిరియడ్
● 11.50 – 12.30 వరకు ఆరో పిరియడ్
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు
ఉన్నత 176
కేజీబీవీలు 18
మోడల్ 09
యూపీఎస్‌లు 114
ప్రాథమిక 770
మొత్తం విద్యార్థుల సంఖ్య 1,22,556
24 నుంచి వేసవి సెలవులు
విద్యా సంవత్సరం ప్రకారం వచ్చే నెల 23వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అమలు
ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ

నేటి నుంచి ఒంటిపూట బడులు
Comments
Please login to add a commentAdd a comment