భానుడి భగభగలు
● జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు ● మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో ఆరెంజ్ అలర్ట్ ● వడగాల్పులతో జనం బెంబేలు
బషీరాబాద్: భానుడు భగ్గుమంటున్నాడు. శుక్రవారం జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 17 మండలాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. కొడంగల్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 28.7 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం 10 గంటలకే వడగాలులు వీస్తుండటంతో జనం హడలిపోతున్నారు. ఎండల తీవ్రత కారణంగా రోడ్లమీదకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు బోరుబావులు, చెరువుల్లో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి.
ఉష్ణోగ్రతలు డిగ్రీల్లో..
ప్రాంతం గరిష్టం కనిష్టం
మర్పల్లి 40.3 32.7
మోమిన్‌పేట 40.2 30.9
ధారూరు 40.0 32.4
పూడూరు 40.0 32.4
బంట్వారం 39.2 31.6
దౌల్తాబాద్ 39.1 32.1
నవాబుపేట 39.1 29.0
వికారాబాద్ 39.0 27.7
బషీరాబాద్ 38.8 29.5
పరిగి 38.5 30.7
యాలాల 38.5 31.1
చౌడాపూర్ 38.4 30.9
తాండూరు 38.2 30.8
కుల్కచర్ల 38.1 30.6
దోమ 37.9 28.4
పెద్దేముల్ 37.6 31.1
బొంరాస్‌పేట 37.3 27.8
దుద్యాల్ 36.4 29.0
కొడంగల్ 36.1 28.7
Comments
Please login to add a commentAdd a comment