భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
కుల్కచర్ల: మండలంలోని పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కోట్ల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు పాండుశర్మ గ్రామస్తులతో కలసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కుక్కపై ఎలుగుబంటి దాడి
బెల్కటూర్ శివారులో ఘటన
తాండూరు రూరల్: మండలంలోని బెల్కటూర్ శివారులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామ శివారులోని ఓ పాలిషింగ్ యూనిట్ పరిసరాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఎలుగుబంటి కనిపించింది. దాన్ని చూసిన కుక్కలు మొరగడంతో ఎలుగుబంటి దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కుక్క మూతి భాగానికి తీవ్ర గాయమైంది. ఈ విషయమై తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతిని వివరణ కోరగా.. గ్రామ శివారులో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారని తెలిపింది. తమ సిబ్బంది జంతువు కాలి ముద్రలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
నేటి నుంచి ధ్యానోత్సవం
ఇబ్రహీంపట్నం: హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ, శ్రీ రామచంద్ర మిషన్ సంయుక్తంగా శని, ఆది, సోమవారాల్లో ఇబ్రహీంపట్నంలోని ఓసీ కమ్యూనిటీ హాల్‌లోఽ ధ్యానోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 15 సంవత్సరాలు దాటిన వారంతా ఈ ధ్యానోత్సవానికి హాజరు కావొచ్చని తెలిపారు. ధ్యానంతో కలిగే భౌతిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఈ కార్యక్రమంలో వివరించనున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ ప్లీడర్‌గా
గీతావనజాక్షి
మొయినాబాద్: పెద్దమంగళారం మాజీ సర్పంచ్, న్యాయవాది గీతావనజాక్షి అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రంగారెడ్డి కలెక్టర్, మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారానికి చెందిన గీతావనజాక్షి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2013 నుంచి 2018 వరకు ఆమె గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. మహిళలకోసం లీగల్ క్లినిక్‌ను సైతం నడుపుతున్నారు. చేవెళ్ల జూనియర్ సివిల్ కోర్టు, ఇతర కోర్టులకు అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్‌గా ఆమెను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులైన సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
Comments
Please login to add a commentAdd a comment