
మన బాధ్యత
మెరుగైన వైద్యం
● కలెక్టర్ ప్రతీక్‌జైన్
పూడూరు: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందేలా వైద్యాధికారులు చొరవ చూపాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. గురువారం పూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ట్రైనీ కలెక్టర్ ఉమాహారతితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు, కల్పించాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మందులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రి భవనాన్ని, పరిసరాలను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యసేవలు అందించాలని అన్నారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అవసరం మేరకు లైట్లు, ఫ్యాన్లు సమకూర్చుకోవాలని సూచించారు. రోగులు, గర్భిణులకు అందుతున్న సేవలను డాక్టర్ దేవికారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఇంకా ఏమైనా అవసరం ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ భరత్‌గౌడ్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment