
హోలీ శుభాకాంక్షలు
స్పీకర్ ప్రసాద్‌కుమార్
అనంతగిరి: రాష్ట్ర ప్రజ లకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో హోలీ శు భాకాంక్షలు తెలిపారు. పండుగను స్నేహితు లు, కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. శరీరానికి హాని కలిగించని రంగులను వినియోగించాలన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
అనంతగిరి: వికారాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యలు, సూచనలను సెల్ నంబర్ 9959226252కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు.
తాండూరులో..
తాండూరు టౌన్: తాండూరు ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యల పరిష్కా రం కోసం శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఎం సురేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలను సెల్ నంబర్ 9959226251కు కాల్ చేసి తెలపాలన్నారు. ఉదయం 10నుంచి 11 గంటల మధ్య కాల్ చేయవచ్చని తెలిపారు. చేసి తెలియపరచాలన్నారు.
16న మెగా జాబ్‌మేళా
తాండూరు టౌన్: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 16న ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా నిరుద్యోగుల కోసం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీ ఫాక్స్‌కాన్ వారి సౌజన్యంతో ఈ జాబ్‌మేళా నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 2గంటల వరకు జాబ్‌మేళా ఉంటుందన్నారు. పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన మహి ళా నిరుద్యోగులు తమ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం సెల్ నంబర్ల 9739693954, 8688547057లో సంప్రదించాలన్నారు.
చట్టాలపై
అవగాహన ఉండాలి
అనంతగిరి: చట్టాలపై నేటి యువతకు అవగాహన ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్ అన్నారు. గురువారం వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో బాధ్యతగల పౌరులుగా మెలగాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేష్, రాము, శ్రీనివాస్, ప్యానల్ న్యాయ వాది రాజశేఖర్, ప్రిన్సిపాల్ మందారికా అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పీఎంశ్రీ పథకాన్ని
రద్దు చేయాలి
షాద్‌నగర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బీస సాయిబాబ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు గురువారం సీఐటీయూ నాయకులతో కలిసి సీడీపీఓ షబానా బేగంకు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment