
24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
● తిరుమల తరహాలో నిత్య కై ంకర్యాలు ● రోజూ శ్రీవారికి వాహన సేవలు ● ఏర్పాట్లు చేస్తున్న ఆలయ ధర్మకర్తలు
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్‌లో వెలిసిన శ్రీవారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన కలియుగ వైకుంఠ దైవం పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తుల ఇలవేల్పుగానిలిచిన శ్రీవారి ఉత్సవాలను వేద పండితులైన బ్రాహ్మణులు తిరుమల తరహాలో నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. తిరుమల తిరుపతి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించే ఉత్సవాల్లో నిత్యం వాహన సేవలు, నిత్య కై ంకర్యాలు, పూజలు, సుప్రభాతం, తోమాల సేవ, అలంకరణ కనుల పండువగా కొనసాగుతాయి. గతం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగించడానికి ధర్మకర్తలు సిద్ధమయ్యారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శేష వస్త్రాలను సమర్పిస్తారు.
నిత్య కార్యక్రమ వివరాలు
24వ తేదీ సోమవారం కోవిలాళ్వార్ల తిరుమంజనం, 25న మంగళవారం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పన, 26న ధ్వజారోహణం, తిరుచ్చి ఉత్సవం, పెద్ద శేషవాహనం, 27న చిన్న శేషవాహనం,హంసవాహనం, 28న సింహవాహనం, వ్యాళి వాహనం,29న కల్పవక్ష వాహనం, సర్వభూపాల వాహనం, అమావాస్య పూలంగి సేవ, 30న మోహినీ అవతార ఉత్సవం, ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం, గరుడోత్సవం, లంకా దహనం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శేష వస్త్రాలు సమర్పన, 31న హనుమంత వాహనం, వసంతోత్సవం, గజవాహ నం, ఏప్రిల్ 1న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 2న రథోత్సవం, అశ్వవాహనం వీధి ఉత్సవం, 3న పల్లకీ ఉత్సవం, చక్రస్నానం, ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం 3గంటలకు ఉత్సవర్లకు అభిషేకం, సాయంత్రం 7గంటలకు ఊంజల్ సేవ, శ్రీ బాలాజీ పాడుతా తీయగా కార్యక్రమం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు భజన కార్యక్రమాలు ఉంటాయి.

24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment