
దాహం.. దాహం
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025
10లోu
కొడంగల్: మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కృష్ణమ్మ ప్రజల దాహం తీరుస్తోంది. కొడంగల్, పాత కొడంగల్, గుండ్లకుంట, కొండారెడ్డిపల్లి, బూల్కాపూర్, ఐనన్‌పల్లి గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణ శివారులో సిద్దనొంపు సమీ పంలో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (డబ్లుటీపీ) నుంచి ఓవర్‌హెడ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసి కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్ పరిధిలో తాగునీటి సమస్య లేదని కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యం నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు.
ఏటా వేసవిలో తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిసినా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ నీటి సమస్య ఉంది. పట్టణ ప్రజలకు సరిపడా నీరు సరఫరా కావడం లేదు. వికారాబాద్‌లో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. తాండూరు, పరిగి పట్టణాల్లో కూడా ప్రజలకు నీటిపాట్లు తప్పడం లేదు. కొడంగల్ పట్టణంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.
వికారాబాద్: మున్సిపల్ పరిధిలో రోజు తప్పించి రోజు తాగునీరు సరఫరా అవుతోంది. మిషన్ భగీరథ పథకం ద్వారా దాదాపు 90 శాతం మేర నీటి అవసరాలు తీరుతున్నాయి. మిగతా లోటును బోరు బావులు, హ్యాండ్ పంపుల ద్వారా తీరుస్తున్నారు. పైప్‌లైన్ లీకేజీలు పెద్ద సమస్యగా మారింది. దీంతో తాగునీరు కలుషితమవుతోంది. ప్రజలు ఆ నీటిని తాగలేక వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. పైప్‌లైన్లు వేసే సమయంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం వల్ల తొందరగా లీకేజీ అవుతున్నాయి. చాలా కాలనీల్లో నల్లా కనెక్షన్‌కు ఉన్న ట్యాపులు, మీటర్లను తొలగించారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి
మున్సిపల్ పరిధిలో 16వేల నివాసాలు.. 70 వేల జనాభా, 10,600 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు ఒకరికి 100 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన వికారాబాద్ మున్సిపాలిటీకి రోజుకు 7 ఎంఎల్‌డీ(మిలియల్ లీటర్ ఫర్ డే) నీరు అవసరం. ప్రస్తుతం రోజు తప్పించి రోజు సరఫరా చేస్తున్నారు. రెండు రోజులకు 14 ఎంఎల్‌డీ నీరు అవసరం కాగా 10.4 ఎంఎల్‌డీలే సరఫరా అవుతోంది. వీటితో పాటు మున్సిపల్ పరిధిలో 198 బోరు బావులు, 56 చేతిపంపులు ఉన్నాయి. నల్లాలు లేని చోట వాటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి సమస్యలు తలెత్తితే శివారెడ్డిపేట్ చెరువును నుంచి సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
న్యూస్‌రీల్
దాహం తీరుస్తున్న కృష్ణమ్మ
వికారాబాద్ మున్సిపాలిటీలో తాగునీటికి అవస్థలు రోజు విడిచి రోజు సరఫరా పట్టణ జనాభా 70వేలు,నల్లా కనెక్షన్లు 10,600 నిత్యం 14 ఎంఎల్‌డీ నీరు అవసరం ప్రస్తుతం సరఫరా చేస్తున్నది10.4 ఎంఎల్‌డీలే

దాహం.. దాహం

దాహం.. దాహం
Comments
Please login to add a commentAdd a comment