
సన్నాల సంబురం
రేషన్ బియ్యం కొనుగోలుకు లబ్ధిదారుల ఆసక్తి
వికారాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేపట్టడంతో రేషన్ దుకాణా ల్లో అమ్మకాలు పెరిగాయి. గతంతో పోలిస్తే జిల్లా లో లబ్ధిదారులు 225 మెట్రిక్ టన్నుల బియ్యం అధికంగా తీసుకున్నారు. ఇదివరకు ఎప్పుడు రేషన్ దుకాణాలకు రాని వారు సైతం ఈ నెల సన్న బియ్యం పంపిణీ అనగానే షాపుల ఎదుట బారులు తీరారు. ఈ నెల 4 నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించగా 20వ తేదీ వరకు 85.11 శాతం బియ్యం పంపిణీ చేశారు. గతంలో దొడ్డు రకం బియ్యం పంపిణీ చేసే సమయంలో 80 శాతం బియ్యం పంపిణీ అయ్యేవి. మార్చి నెలలో నమోదైన గణాంకాలను బట్టి 80.40 శాతం బియ్యం పంపిణీ చేశారు. సన్నబియ్యం పంపిణీతో ఐదు శాతం పెరిగింది. మొత్తం మీద 225 మెట్రిక్ టన్నుల బియ్యం అధికంగా పంపిణీ అయినట్లు గణాంకాలు నమోదయ్యాయి.
అక్రమాలకు అడ్డుకట్ట
మిల్లర్ల మాయాజాలం.. రేషన్ డీలర్ల కుమ్మక్కు మంత్రం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో గతంలో రేషన్ బియ్యం పంపిణీ పథకం అబాసుపాలైన విషయం బహిరంగ రహస్యమే. ఇప్పటి వరకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యంలో 50 శాతానికి పైగా లబ్ధిదారులకు విక్రయించేవారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నోమార్లు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడేవి. ఈ నెల ఇలాంటి కేసు నమోదైన దాఖ లా కనిపించలేదు. దొడ్డు బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసే మిల్లర్లు వాటినే రీసైక్లింగ్ చేసి మళ్లీ ప్రభుత్వానికి లెవీ రూపంలో ఇచ్చేవారు. వారికి ఇచ్చే ధాన్యం బయట విక్రయించి సొమ్ము చేసుకునేవారు. మెజార్టీ ప్రజలు సన్నబియ్యం తినేందుకు అలవాటు పడటం.. ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో ఆ పథకం ఫెయిల్యూర్ అయిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యం పథకంతో చాలా వరకు దుర్వినియోగాన్ని అరికట్టినట్టయింది.
అసత్య ప్రచారాలపై సీరియస్
ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు రేషన్ షాపులకు క్యూ కడుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థపై నమ్మకం కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. మిల్లర్ల మాయాజాలంతో దొడ్డుబియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యమని భ్రమలు కల్పించి పంపిణీ చేస్తే నమ్మకం పోయే ప్రమాదముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అవకతవకలకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంతో పాటు అధికారులపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా సన్నరకం బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారని ఇటీవల సన్నబియ్యంపై అనేక పుకార్లు షికార్లు చేయడంతో అధికారులు ఖండించారు. అధారాలు లేకుండా ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసే వారిని ఉపేక్షించమని.. అవసరమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రేషన్ సమాచారం
మండలాలు 20
రేషన్ దుకాణాలు 588
రేషన్ కార్డులు 2,48,122
సభ్యులు 8,52,122
ఏప్రిల్ కోటా 5,582
మెట్రిక్ టన్నులు
దుకాణాల వద్ద క్యూ
రెండు వారాల్లోనే 85.11 శాతం పంపిణీ
గతంతో పోలిస్తే 225 మెట్రిక్ టన్నుల అధికంగా తీసుకున్న రేషన్ కార్డుదారులు
రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో లబ్ధిదారులురేషన్ షాపుల వద్ద బారులు తీరుతున్నారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో అక్రమార్కులు తావులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అవకతవకలకు తావివ్వం
సన్నబియ్యం పంపిణీతో ప్రజలు సంతోషంగా ఉన్నా రు. పంపిణీ చేసే స్టాక్ పా యింట్ మొదలు కుని రేష న్ దుకాణాల్లో లబ్ధిదారుల కు చేరే వరకు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.పంపిణీ చేస్తున్న సమయంలో తూకం త క్కువగా వచ్చాయని కొన్ని చోట్ల ఆరోపణలు వచ్చా యి. వెంటనే తనిఖీ చేశాం. టెక్నికల్ సమస్యలవల్లే ఆరోపనలు వచ్చాయి వాటిలో వాస్తవం లేదు. గ తంతో పోలిస్తే ఈ నెల బియ్యం తీసుకెళ్లే వారి శా తం పెరిగింది.ఏ సమస్యలున్నా లబ్ధిదారులు ఫిర్యా దు చేస్తే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం.
– మోహన్‌బాబు, డీఎస్‌ఓ, వికారాబాద్