
చీమల్‌దరిని ఆదర్శంగా తీసుకోవాలి
బీహార్, కేంద్ర బృందం
మోమిన్‌పేట: జాతీయ అవార్డు పొందిన చీమల్‌దరి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని బీహార్, కేంద్ర బృందం సభ్యులు కితాబి చ్చారు. శుక్రవారం గ్రామంలో బీహార్‌కు చెందిన సర్పంచులు, కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, రోడ్లు, భూగర్భ మురుగు కాల్వల నిర్మాణం, ప్రజలకు పంచాయతీ నుంచి అందుతున్న సేవలు, పన్నుల వసూలు, వీధి దీపాల నిర్వహణను పరిశీలించారు. మారుమూల గ్రామం ఇంతగా అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. గ్రామస్థుల సహకారం, పంచాయతీ పాలకవర్గం పనితీరును కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, డీఎల్‌పీఓ సంధ్యారాణి, ఎంపీఓ యాదగిరి, పంచాయతీ కార్యదర్శి భరత్ తదితరులు పాల్గొన్నారు.
భారత్ సమ్మిట్‌లో
ఎమ్మెల్యే బీఎంఆర్
తాండూరు: భారత్ సమ్మిట్‌లో కళాశారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా శుక్రవారం భారత్ సమ్మిట్ (2025) కార్యక్రమం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్‌కు ఎమ్మె ల్యే హాజరయ్యారు. కళాకారులు ఏర్పాటు చేసి న స్టాల్స్‌ను పరిశీలించి రాట్నం ఆడించారు.
పరిసరాలు పరిశుభ్రంగా
ఉంచుకోవాలి
మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య
పరిగి: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ వెంకటయ్య సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పరిగి తోపాటు ఆయా గ్రామాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోమ కాటు వల్ల మలేరియా వ్యాపిస్తుందన్నారు. దోమలను నిర్మూలించేందుకు పరిసరాల శుభ్రతతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’ వాయిదా
అనంతగిరి: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో భూ భారతి రైతు అవగాహన సదస్సులు జరుగుతున్నందన ఈ నెల 28న జరగాల్సిన ప్రజావాణిని వాయిదా వేశామని తెలిపారు. మే నెల నుంచి యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఇందుకు సహకరించాలని కోరారు.
సీల్ టెండర్ల ఆహ్వానం
అనంతగిరి: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి రిజిస్ట్రేషన్ అయిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి సీల్ టెండర్లు కోరుతున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ల ఫారాలు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం నుంచి మే 6వ తేదీ లోపు పొందవచ్చని తెలిపారు. ఆసక్తి గల ఏజెన్సీలు ఏప్రిల్ 28 నుంచి మే 6వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట లోపు సీల్ టెండర్లు సమర్పించాలని సూచించారు. మే 6వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అందుబాటులో ఉన్న ఏజెన్సీల సమక్షంలో టెండర్లను తెరవడం జరుగుతుందని తెలిపారు. టెండర్ ఫారాలు, ఇతర సమాచారం కోసం జిల్లా ఉపాధి కల్పనాధికారిని సెల్ నంబర్ 91776 07016లో సంప్రదించాలని సూచించారు.

చీమల్‌దరిని ఆదర్శంగా తీసుకోవాలి

చీమల్‌దరిని ఆదర్శంగా తీసుకోవాలి