
విశాఖపట్నం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరి.. లేడీ విలన్ అని బీఆర్‌ఎస్ నాయకుడు జేటీ రామారావు ఓ ప్రకటనలో ఆరోపించారు. ఆనాడు సోనియాగాంధీ మెప్పు కోసం రాష్ట్ర విభజన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపి, రాష్ట్ర ప్రజలను రోడ్డుపాలు చేసిన వారిలో పురందేశ్వరి ఒకరన్నారు. మరోసారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆమె సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమె ఏనాడూ సమైక్యాంధ్ర, రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్, అమరావతి, పోలవరం ఉద్యమాల్లో పాల్గొన లేదని, కనీసం సంఘీభావం కూడా తెలియజేయలేదన్నారు. కేవలం ఢిల్లీ సుల్తాన్‌ల మెప్పు కోసం మాత్రమే పనిచేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో లేడీ విలన్‌గా పురందేశ్వరి పేరు గాంచారని ఆరోపించారు. ఆమెకు నల్ల జెండాలు, నల్ల బెలూన్లతో స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
2009 పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచారన్నారు. శ్రీశ్రీ నివాసాన్ని లైబ్రరీగా మారుస్తానని సుమారు రెండు కోట్లకు పైగా వసూలు చేసి ఇంత వరకు ఎందుకు నిర్మించలేకపోయారని ఆమెను ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment