మార్గశిర మాసోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, విశాఖపట్నం : సౌర విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శుక్రవారం నుంచి సోలార్ ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు ఏపీ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.హేమకుమార్ తెలిపారు. ఎక్స్‌పో వేదికై న ఏయూ హెలిప్యాడ్ గ్రౌండ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ రీ నెక్ట్స్ పేరుతో సోలార్ రెన్యువబుల్ ఎనర్జీ ఎక్స్‌పో–2024 నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ కార్యక్రమానికి మద్దతుగా రూఫ్ టాప్ సోలార్‌పై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. గ్రీన్ ఎనర్జీ సోలార్ సెల్ కన్వీనర్ సీహెచ్.రామమోహన్‌రావు మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఎక్స్‌పోలో ఏపీలోని వివిధ రకాల సోలార్ సంస్థలు, రుణసహాయాన్ని అందించే బ్యాంకులు, స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తాయన్నారు. ఈ ప్రదర్శనకు ఏపీఈపీడీసీఎల్, నెడ్‌క్యాప్, రాష్ట్ర ప్రభుత్వం సహకారమందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.నాగరాజు, కోశాధికారి సీహెచ్ జయబాబు పాల్గొన్నారు.
మహారాణిపేట: వచ్చే నెల 2 నుంచి 30 వరకు కనకమహాలక్ష్మి దేవస్థానంలో జరగనున్న మార్గశిర మాసోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేందిరప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో సమీక్ష జరిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, సరిపడా క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణ, అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, నిత్యాన్నదానం, ప్రసాదం కౌంటర్, క్యూలైన్ల వద్ద సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు జగన్నాథస్వామి ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ ఉంటుందని, డిసెంబర్ 26న మహాన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప కమిషనర్, ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. ఉచిత, సర్వ దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తూ వీఐపీ పాసులను పరిమితం చేసి, దర్శన వేళలను కుదించామన్నారు. జిల్లా సహాయ కమిషనర్ అన్నపూర్ణ, ఈఈ సీహెచ్‌వీ రమణ, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment