ఒడిశాలో హత్య.. ఇక్కడ నిందితుల అరెస్ట్
పీఎంపాలెం: ఒడిశా రాష్ట్రంలోని సుందర్‌గఢ్ జిల్లా రాజ్‌గంగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని బుధవారం పీఎంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి.. ఒడిశాకు చెందిన సుజిత్ బెంగ్రా, మున్నా సన్యాసి ఓ హత్య చేసిన కేసులో ప్రధాన నిందితులు. పీఎంపాలెం బాబా ఇంజినీరింగ్ కాలేజీ ఏరియాలో నిందితుల్లో ఒకరి చెల్లెలు నివసిస్తోంది. ఒడిశా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొన్ని రోజులుగా నిందితులు ఆమె వద్ద తలదాచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఒడిశా పోలీసులు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుల ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఒడిశా తీసుకెళ్లారు.
ఒడిశాలో హత్య.. ఇక్కడ నిందితుల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment