బాల్‌బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లకు ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

బాల్‌బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లకు ప్రశంసలు

Published Thu, Feb 20 2025 8:04 AM | Last Updated on Thu, Feb 20 2025 8:04 AM

-

విశాఖ స్పోర్ట్స్‌: సీనియర్‌ నేషనల్‌ బాల్‌బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సాధించడంలో ప్రతిభ చూపిన ఈకో రైల్వేకు చెందిన ముగ్గురు ఆటగాళ్లను డీఆర్‌ఎం మనోజ్‌కుమార్‌ సాహూ అభినందించారు. ఈ టోర్నీలో సీహెచ్‌ వెంగళరావు చక్కటి ప్రతిభ కనబరిచి స్టార్‌ ఆఫ్‌ ఇండియా అవార్డును అందుకున్నారు. డి.వి.గణేష్‌, పి.కార్తీక్‌ సత్తా చాటారు. వాల్తేర్‌ డీఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో వాల్తేర్‌ ఈకో రైల్వే స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ బాఠి, సంయుక్త స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ బి.అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement