● ఇందిరాగాంధీ జూపార్క్‌లో సరికొత్త ఆకర్షణ
ఆరిలోవ: ఇందిరా గాంధీ జూ పార్కులో లవ్ బర్డ్స్ జోన్ కొత్త సొబగులు సంతరించుకుంది. జూ పార్కు ఏర్పాటు చేసిన సమయంలో పక్షుల కోసం ప్రత్యేకంగా జోన్ నిర్మించారు. అందులో వివిధ గూళ్లలో రకరకాల లవ్ బర్డ్స్‌ను పెట్టారు. ఆ గూళ్ల చుట్టూ రెండు వరుసల్లో ఇనుప మెష్‌లు ఉండటంతో సందర్శకులకు వాటి అరుపులు తప్ప పక్షులు సరిగా కనిపించేవి కాదు. దీంతో జూ అధికారులు ఇటీవల ఈ జోన్‌ను ఆధునికీకరించారు. ఇనుప మెష్‌లను తొలగించి.. వాటి స్థానంలో కొత్తగా అద్దాలతో గూళ్లు నిర్మించారు. వాటికి గాలి, వెలుతురు తగిలేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు అద్దాల లోపల పక్షులు సందర్శకులకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అద్దాల గూళ్లలో లవ్ బర్డ్స్
● ఇందిరాగాంధీ జూపార్క్‌లో సరికొత్త ఆకర్షణ
Comments
Please login to add a commentAdd a comment