కొత్త ఎగుమతిదారులకు ప్రోత్సాహం
మహారాణిపేట: మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(ఎంఎస్‌ఎంఈ) డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఐఈఓ) సహకారంతో నగరంలోని ఒక హోటల్‌లో నిర్వహించిన సదస్సు బుధవారం ముగిసింది. గత రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సులో 18 దేశాలకు చెందిన 25 మంది కొనుగోలుదారులు, 430 మందికి పైగా ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్. యువరాజ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, రెడీమేడ్ వస్త్రాలు, కాస్మోటిక్స్, ఫార్మా తదితర రంగాలకు చెందిన 79 అవగాహన ఒప్పందాలు జరిగాయి. సుమారు రూ. 60 కోట్ల మేర వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సదస్సులో 38 మంది కొత్త ఎగుమతిదారులకు ప్రోత్సాహం లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో ఎం.విశ్వ, ఎఫ్‌ఐఈవో దక్షిణ రీజినల్ చైర్మన్ గోపాలకృష్ణన్, జాయింట్ డైరెక్టర్ జనరల్ ఉన్ని కృష్ణన్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషు పాల్గొన్నారు.
రూ.60 కోట్ల మేర 79 ఒప్పందాలు
Comments
Please login to add a commentAdd a comment