కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్
సీతమ్మధార: ఆప్కాస్‌ను రద్దు చేస్తే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రైవేట్ ఏజన్సీలకు, కాంట్రాక్టర్లకు అప్పగించొద్దని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించింది. సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, వినతి పత్రం అందించింది. యూనియన్ అధ్యక్షుడు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు, గౌరవ అధ్యక్షుడు పి.వెంకట్ రెడ్డిలు మాట్లాడుతూ ఆప్కాస్ కంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా డెత్, రిటైర్మెంట్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలన్నారు. ఎంప్లాయి పదాన్ని ఆప్కాస్ నుంచి తొలగించి, ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని కోరారు. 62 ఏళ్ల రిటైర్మెంట్ వయసు, గత సమ్మె ఒప్పందం ప్రకారం ప్రమాద మరణానికి రూ.7 లక్షల పరిహారం, పెరిగిన జనాభా ఆధారంగా సిబ్బంది పెంపు తదితర డిమాండ్లు చేశారు. కార్యక్రమంలో గొలగాని అప్పారావు, ముద్దాడ ప్రసాద్, జేఅర్ నాయుడు, శీర రమణ, ఇ.అదినారాయణ, గణేష్, ఈశ్వరరావు, శ్రీను, బాలు, వరలక్ష్మి, పద్మ, లలిత, రాజశేఖర్, వెంకటరావు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment