వైఎస్ జగన్‌తో కన్నబాబు భేటీ
సాక్షి, విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బుధవారం భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత తొలిసారి ఆయన జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి, వాటిపై పోరాడాలని జగన్‌మోహన్‌రెడ్డి కన్నబాబుకు నిర్దేశించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఇంకా ఎండగట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్ని మరింత సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ఆదేశించారు.
ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లాలో 13 పోలింగ్ స్టేషన్లు
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలో 13 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలో మొత్తం 21,555 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. విశాఖలో 5,277 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 2,403 మంది, సీ్త్రలు 2,874 మంది ఉన్నారు. వీరి కోసం అన్ని మౌలిక సదుపాయాలతో మండలాల వారీగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment