ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు గురువారం మీల్ కార్డు నగదు జమ చేశారు. నాలుగు నెలలు పెండింగ్‌లో ఉండగా ఒక నెల నగదు మాత్రమే జమ అయింది. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు ప్రతి నెలా మీల్ కార్డు కోసం.. రోజుకు రూ.100 చొప్పున పని దినాల ఆధారంగా జీతం నుంచి కోత విధించి మీల్ కార్డులో జమ చేస్తారు. అయితే నాలుగు నెలలుగా ఉద్యోగుల జీతాల నుంచి కోత విధించడం తప్ప మీల్ కార్డుకు జమ కావడం లేదు. దీంతో ప్రతీ ఉద్యోగికి రూ.10 వేల వరకు బకాయి పేరుకుపోయింది. ఉక్కు యాజమాన్యం మీల్ కార్డు సంస్థకు దాదాపు రూ.14 కోట్లు బకాయి పడటంతో, వారు నాలుగు నెలలుగా నగదు జమ చేయడంలో విముఖత చూపినట్లు తెలుస్తోంది. చివరికి ఉక్కు అధికారులు మీల్ కార్డు సంస్థ అధికారులతో జరిపిన చర్చలు ఫలించడంతో, ఒక నెలకు సంబంధించిన నగదును ఇప్పుడు జమ చేశారు. అయితే మిగిలిన మూడు నెలల బకాయిల సంగతేమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment