నిలకడగా విద్యార్థినుల ఆరోగ్యం
పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ ప్రారంభం
పెదగంట్యాడ: పోలీసుల సంక్షేమానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు. మండలంలోని బీసీ రోడ్డు దయాల్ నగర్ ఎదురుగా పోలీస్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను గురువారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విశాఖలో తొలిసారిగా పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పెట్రోల్ బంక్ నిర్వహణ విషయంలో రాజీ పడవద్దని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాల్లో విధిగా తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఉచితంగా గాలి అందించాలని, మరుగు దొడ్ల సదుపాయం కల్పించాలని తెలిపారు. బంక్‌లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. బీపీసీఎల్ ప్రతినిధులను సత్కరించారు. కార్యక్రమంలో డీసీపీ–2 మేరీ ప్రశాంతి, డీసీపీ అడ్మిన్ కృష్ణకాంత్ పటేల్, ఏడీసీపీ డాక్టర్ వి.బి.రాజ్‌కమల్, ఏసీపీ–1 ఎస్‌వి అప్పారావు, హార్బర్ ఏసీపీ కాళిదాస్, గాజువాక ఏసీపీ త్రినాథ్, న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు, ఎస్‌ఐలు గణపతి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment