మాతా, శిశు మరణాలు అరికట్టాలి
మహారాణిపేట: మాతా, శిశు మరణాలు అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మాతా, శిశు మరణాలకు అవకాశం లేకుండా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటివి రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అతిసార వ్యాధి నియంత్రణకు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు చేయాలన్నారు. టీబీ, కుష్టు, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఆస్పత్రుల పనితీరుపై తరచూ సమీక్ష నిర్వహించి, తగు సూచనలివ్వాలని పేర్కొన్నారు. 108, 104 పనితీరుపై సమీక్ష జరపాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు, జిల్లా ప్రొగ్రాం అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
చికెన్ ధరలు
చికెన్ (కిలో) (వెన్‌కాబ్)
బ్రాయిలర్ (లైవ్) : రూ.95
స్కిన్ : రూ.160
స్కిన్‌లెస్ : రూ.170
Comments
Please login to add a commentAdd a comment