విశాఖ లీగల్: విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 23న జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ నూతన కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన న్యాయవాదులతో సదస్సు నిర్వహించనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బెవర సత్యనారాయణ తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు డిమాండ్ 1993 నుంచి ఉందని, ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 43 శాతం ఈ ప్రాంతానికి చెందినవేనని పేర్కొన్నారు. విశాఖలో హైకోర్టు బెంచ్‌తోపాటు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం జస్టిస్ ఎట్ డోర్ స్టెప్స్ నినాదంతో జరిగే ఈ సదస్సులో కార్యాచరణను రూపొందిస్తామన్నారు. తొలి దశలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాష్ట్ర గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రికి వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు. మలిదశలో ప్రజాప్రతినిధుల సహకారంతో కార్యక్రమాలు రూపొందిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment