తెలుగు తల్లికి నీరాజనం
మద్దిలపాలెం: మాతృభాషా దినోత్సవం సందర్భంగా మద్దిలపాలెం కూడలిలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు దండు ఆధ్వర్యంలో తెలుగుతల్లి కీర్తనలతో సందడి చేశారు. జీవీఎంసీ స్కూల్, వండర్ కిడ్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొని.. పాటలు, పద్యాలతో తెలుగు తల్లిని కీర్తించారు. తెలుగు దండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ యునెస్కో సూచన మేరకు 2000 సంవత్సరం నుంచి ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషాభిమానులు జరిపే ఏకై క ‘విశ్వవేడుక‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అని కొనియాడారు. మాతృభాష కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా త్యాగం చేసిన బంగ్లాదేశ్ విద్యార్థులకు నివాళులర్పించారు. ఆ స్ఫూర్తితో తెలుగు వారంతా అమ్మభాషను కాపాడుకునేందుకు కంకణబద్ధులు కావాలన్నారు. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉమాగాంధీ, కాశీవిశ్వేశ్వరం, చిన సూర్యనారాయణ, శ్రీధర్, కొచ్చెర్లకోట సత్యనారాయణమూర్తి, భాగవతుల విశ్వనాథం, మదరిండియా మాధవి, పంతుల లలిత, పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొని తెలుగు తల్లికి నీరాజనాలు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment