రైల్వే కార్మికుల ‘డిమాండ్ డే’ నిరసన
తాటిచెట్లపాలెం: ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ దేశవ్యాప్త పిలుపు మేరకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ డివిజనల్ కో ఆర్టినేటర్ పి.రామ్మోహనరావు ఆధ్వర్యంలో శుక్రవారం డిమాండ్ డే నిర్వహించారు. దొండపర్తిలోని డీఆర్‌ఎం కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో కార్మికులు, యూనియన్ నాయకులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు సమస్యల పరిష్కారం కోసం వినతులు ఇస్తున్నా, రైల్వే శాఖ పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. ఓపీఎస్‌లో ఉన్న అన్ని అన్ని ప్రయోజనాలతో యూపీఎస్‌ను అమలు చేయాలన్నారు. పాయింట్స్ మెన్ కేటగిరీ ఉద్యోగులకు 4గ్రేడ్ పే అమలు, ఉద్యోగుల పిల్లలకు ఉన్నత చదువుకు ఎడ్యుకేషనల్ అలవెన్సులు తదితర 50 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్‌ఎం మనోజ్‌కుమర్ సాహూకు అందించారు. కార్యక్రమంలో యూనియన్ జోనల్ అధ్యక్షుడు పీవీజే రాజు, కార్యదర్శి బి.దామోదరరావు, ఆర్‌వీఎస్‌ఎస్ రావు, వెల్ఫేర్ అసోసియేషన్ జోనల్ అధ్యక్షులు ఎం సన్యాసిరావు, గౌతం దేవ్, ఇతర కేంద్ర నాయకులు, బ్రాంచ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment