సీతమ్మధార: యూఎల్‌సీ పరిధిలో ఆక్రమణదారులు భూ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ ఎం.రమేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 150 చదరపు గజాలు అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణదారులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం.27ను జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందన్నారు. రేసపువానిపాలెం, మద్దిలపాలెం, పెదవాల్తేరు, దొండపర్తి తదితర ప్రాంతాల్లోని 39, 40 సర్వే నెంబర్ల పరిధిలో యూఎల్‌సీ భూములు ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఏళ్ల తరబడి ఆక్రమించి నివాసం ఉంటున్న వారు ముందుగా ల్యాండ్ సర్వే చేయించుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఆక్రమణ విస్తీర్ణం, ఆధార్ కార్డు, స్కెచ్ కార్డు, భూమి రికార్డులు తదితర పత్రాలను జతపరచి, సీతమ్మధారలోని తహసీల్దార్ కార్యాలయంలో అందించాల్సిందిగా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment