విశాఖ స్పోర్ట్స్: యూసీసీ టీ20 క్రికెట్ విజేతగా విజయనగరం జట్టు నిలిచింది. రైల్వే స్టేడియంలో జరిగిన ఫైనల్లో కావలీర్స్ జట్టుపై 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయనగరం జట్టు 8 వికెట్లకు 209 పరుగులు చేయగా, కావలీర్స్ జట్టు 152 పరుగులకు ఆలౌటైంది. ఫైనల్స్‌లో బెస్ట్‌గా రవికిరణ్, టోర్నీ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా కేఎస్‌ఎన్ రాజు, బెస్ట్ బౌలర్‌గా క్రాంతి, టోర్నీ ఓవరాల్ బెస్ట్‌గా వాసు నిలిచారు. బహుమతి ప్రదానోత్సవంలో జీజేజే రాజు, కరణ్, సోనా దోనా, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నలుగురు చిన్నారులకు రూ.లక్ష సాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment