సింథియా: ఇండియన్ నేవీ ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్‌కు చెందిన ఐఎన్‌ఎస్ టిర్, ఐసీజీఎస్ వీరా నౌకలు వియత్నాంలోని కామ్ రాన్ బేకు చేరుకున్నాయని నేవీ వర్గాలు తెలిపాయి. వియత్నాం నేవీ సిబ్బంది, అక్కడ భారత మిషన్ సభ్యులు ఈ నౌకలకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహాన్ని, సహకారాన్ని మరింతగా పెంచుతుందని నేవీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. సందర్శనలో భాగంగా నేవీ బృందాలు వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నాయి. పోర్ట్ కాల్, వివిధ క్రాస్–ట్రైనింగ్ కార్యకలాపాలు, వియత్నాం నావల్ అకాడమీ సందర్శన తదితర కార్యక్రమాలు జరిగాయి. వియత్నాం నేవీ, కోస్ట్ గార్డ్‌లతో ద్వైపాక్షిక విన్యాసాలతో ఈ పర్యటన ముగుస్తుందని నేవీ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment