విశాఖ స్పోర్ట్స్: మీరు ఔత్సాహిక క్రీడాకారులా? అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రాణించాలనే పట్టుదలతో ఉన్నారా? అయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీకు ఆర్థికంగా అండగా నిలవడానికి స్టైఫండ్‌ను అందిస్తోంది. ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్లో రాణిస్తున్న బాలురు, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, వెయిట్‌లిఫ్టింగ్, అథ్లెటిక్స్ క్రీడల్లో రాణిస్తున్న బాలబాలికలు ఈ ప్రోత్సాహకాన్ని అందుకోవచ్చు. 15–18, 18–24 సంవత్సరాల వయసు గల వారు ఇందుకు అర్హులు. సిటీ లేదా గ్రామీణ ప్రాంతం అనే తేడా లేదు. మీరు అర్హులైతే వెంటనే www.fci.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, మార్చి 6వ తేదీలోపు మీ పేరును నమోదు చేసుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, క్రీడా రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోండి.
Comments
Please login to add a commentAdd a comment