విశాఖ సిటీ: చింతూరు లైన్ ఇన్‌స్పెక్టర్ కె.గణేష్ జాతీయస్థాయిలో ఉత్తమ లైన్‌మన్ అవార్డు సాధించారని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన లైన్‌మెన్ దివస్ కార్యక్రమంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ ఘనశ్యామ్ చేతుల మీదుగా ఉత్తమ లైన్‌మన్ అవార్డును గణేష్ అందుకున్నారని పేర్కొన్నారు. గణేష్‌తో పాటు ఉత్తమ లైన్‌మన్‌గా ప్రశంసలు పొందిన అనకాపల్లి సర్కిల్‌కు చెందిన బి.మాణిక్యాలరావు, పార్వతీపురం సర్కిల్ పి.సింహాచలంకు సీఎండీతో పాటు సంస్థ డైరెక్టర్లు డి.చంద్రం, వి.విజయలలిత, బి.రామచంద్రప్రసాద్ అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment