చంద్రబాబును నమ్మి మరోసారి దగాపడ్డ యువత
వైఎస్సార్‌సీపీ హయాంలో
ఉద్యోగాల కల్పన
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లాలోని సచివాలయాల్లో 4,700 శాశ్వత ఉద్యోగాలు, 9,800 వలంటీర్లను నియమించింది. వైద్యారోగ్య శాఖలో వైద్యులు, పారామెడికల్, ఇతర ఉద్యోగాలు 8,500కుపైగా భర్తీ చేసింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా 43,074 మందికి ఉద్యోగాలు కల్పించింది. 2019–20లో 4,001 యూనిట్లు ఏర్పాటు చేసి 8,091 ఉద్యోగాలు, 2020–2021లో 4,450 యూనిట్లు ఏర్పాటు 15,100 మందికి ఉద్యోగాలు, 2022–23లో 4276 యూనిట్లు ఏర్పాటుచేసి 16,145 మందికి ఉద్యోగాలు, 2023–24లో 2414యూనిట్లను ఏర్పాటుచేసి 13,173 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది.
మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం
ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటికే 5 కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. మిగిలిన మెడికల్ కళాశాలలు సగానికి పైగా నిర్మాణపనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేయడానికి యత్నిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించారు. వీటిలో పాడేరు మెడికల్ కశాశాల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే పూర్తి కాగా.. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో సగానికిపైగా నిర్మాణం జరిగింది. ఈ దశలో వచ్చిన కూటమి ప్రభుత్వం రూ.500 కోట్లతో నిర్మిస్తున్న కళాశాలను ప్రైవేట్ చేతులకు అప్పగించే కుట్రలకు పాల్పడుతోంది. ఇది అందుబాటులోకి వస్తే ఏటా 150 ఎంబీబీఎస్ సీట్లలో విద్యార్థులకు ప్రవేశం లభించేది. తర్వాత పీజీ వైద్య కోర్సులు వచ్చేవి. బోధన కోసం 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చేది. కానీ ఇప్పుడది కలగా మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment