ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం..
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, ఎన్నికల ముందు చెప్పిన విధంగా నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కొత్త మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడాన్ని నిరసిస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ ‘యువత పోరు’ నిర్వహిస్తున్నాం. జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు హాజరై ఈ పోరుబాటను విజయవంతం చేయాలి.
– గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment