విద్యారంగంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
విశాఖ విద్య: విద్యారంగంపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం స్టేట్ అడ్వైజర్ బోరుగడ్డ మోహన్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి తెడబారిక సురేష్‌కుమార్, విశాఖ జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి అన్నా రు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం చేపట్టనున్న ‘యువత పోరు’ను విజయవంతం చేయాలని మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు పోస్టర్లు ఆవిష్కరించారు. విద్యారంగాన్ని పట్టించుకోని కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలులో విఫలమైందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులకు చదువులు భారమవుతున్నాయన్నారు. నిరుపేద విద్యార్థులను చదువులకు దూరం చేసి, తద్వారా ప్రైవేట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులు, యువతను నిలువునా మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై అందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాకు విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శెట్టి సుబ్రహ్మణ్యం, సాగర్, అజయ్ కుమార్, రోహిత్, ఖాసీం, పిల్లి సాగర్ తదితరులు పాల్గొన్నారు.
తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి నేటి ‘యువత పోరు’ విజయవంతానికి
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం పిలుపు
Comments
Please login to add a commentAdd a comment