
భారతీయ సంప్రదాయమే సైన్స్ భాండాగారం
గోపాలపట్నం: భారతీయ సంప్రదాయమే సైన్స్ భాండాగారమని డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ అవినాష్ చందర్ అన్నారు. ఎన్‌ఎస్‌టీఎల్ మానసి ఆడిటోరియంలో బుధవారం జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన అంబేడ్కర్ విగ్రహం వద్ద, వేదికపై సర్ సి.వి.రామన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ చందర్ మాట్లాడుతూ మన పూర్వీకుల్లో భాస్కరాచార్య, చక్ర, సుశ్రుత, వరాహమిహిర, ఆర్యభట్ట వంటి ఎందరో మహానుభావులు అనేక కొత్త విషయాలను ఆవిష్కరించారన్నారు. భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉత్తమ ప్రతిభ చూపుతోందని, యువకులు నూతన ఆలోచనలతో ఆవిష్కరణలు చేస్తున్నారని పేర్కొన్నారు. శాసీ్త్రయత శిక్షణ కలిగి ఉండేలా విద్యా విధానంలో మార్పు రావడం స్వాగతించదగినదన్నా రు. పదేళ్ల కిందట 471 స్టార్టప్స్ ఉండగా.. నేడు 1.40 లక్షలకు అవి పెరగడంతో ఉద్యోగాలు కూడా పెరిగాయని చెప్పారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
సైన్స్ డే సందర్భంగా ఎన్‌ఎస్‌టీఎల్‌లో చేపట్టిన కార్యక్రమాలను డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ వివరించారు. సైంటిస్ట్ డి.ఉదయానంద్‌కు సిలికాన్ మెడల్, సర్టిఫికెట్‌ను బహూకరించారు. పలు పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. నరవ హైస్కూల్ విద్యార్థులు మొదటి బహుమతి, ఎన్‌ఎస్‌టీఎల్ రామ్ నాథ్ సెకండరీ స్కూల్ విద్యార్థులు ద్వితీయ బహుమతి సాధించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ సైంటిస్ట్ బోని రమేష్‌బాబు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ అవినాష్ చందర్
ఎన్‌ఎస్‌టీఎల్‌లో ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు

భారతీయ సంప్రదాయమే సైన్స్ భాండాగారం
Comments
Please login to add a commentAdd a comment