ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ యుటిలిటీస్ విభాగంలో జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికునికి గాయాలయ్యాయి. స్టీల్‌ప్లాంట్ పోలీసులు అందించిన వివరాలివి.. విభాగంలో స్కిల్డ్ కార్మికునిగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్.ఆనందరెడ్డి (40) గురువారం విభాగంలోని ఏఎస్‌యూ–1 సెక్షన్‌లో పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ఆక్సిజన్ పంప్ బరస్ట్ అయింది. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఆనందరెడ్డికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి గాజువాకలోని ప్రైవేటు ఆస్పపత్రికి తీసుకెళ్లారు. అతనికి సుమారు 40 శాతం గాయాలయ్యాయి. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం భద్రతపై దృష్టి సారించాలని స్టీల్ ఐఎన్‌టీయూసీ చీఫ్ పేట్రన్ నీరుకొండ రామచంద్రరావు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment