బెయిల్‌పై సీపీఐ నేత జేవీఎస్‌మూర్తి విడుదల
ఆరిలోవ: ఎల్జీ పాలిమర్స్ కేసులో వారం క్రితం అరెస్టయి జైల్‌కు వెళ్లిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తికి బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన గురువారం విడుదలయ్యారు. విష యం తెలుసుకొన్న సీపీఐ జిల్లా నాయకులు విశాఖ కేంద్ర కారాగారానికి చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జేవీ మాట్లాతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న వారిని అరెస్టులు చేసి రిమాండ్‌కు తరలించడం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడమేనని తెలిపారు. కోర్టుకు హాజరైన సమయంలో న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో రీకాల్ చేసుకుంటానని చెప్పినా వినకుండా గోపాలపట్నం పోలీసులు విచక్షణారహితంగా వ్యవ హరించారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు మాట్లాడుతూదొంగలు, ఇసుక మాఫియా, భూకబ్జాలు, లిక్కర్ మాఫియా చేసేవారు బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారన్నారు. అలాంటి వారిని పోలీసులు విడిచిపెడుతున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు విమల, సత్యనారాయణ, శ్రీనివాస్, రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment