
షోకాజ్ నోటీసులతో ఉద్యమాన్ని అణచలేరు
ఉక్కునగరం: స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీసును తక్షణం ఉపసంహరించుకోవాలని సిటు జిల్లా అధ్యక్షుడు ఎన్.రామారావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అయోధ్యరామ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రభావితం చేసే విధంగా కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందన్నారు. కర్మాగారంలో నేటి వరకు ఉన్న ప్రతి ప్రయోజనం పోరాటాల ద్వారానే సాధించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. పోరాటంలో అనైక్యతను సృష్టించడం కోసం ప్రభుత్వం, యాజమాన్యాలు ఎంత ప్రయత్నించినా.. స్టీల్ కార్మికులు మరింత ఐక్యంగా ముందుకు సాగుతారన్నారు. గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ద్వారా స్టీల్ పరిశ్రమలో సమస్యలు పరిష్కారం కావని ఆయన వివరించారు. దీన్ని సమర్ధవంతగా నడపడం కోసం సమర్థవంతమైన నాయకత్వం కావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారని ఆయన గుర్తు చేశారు. సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులతో కార్మిక ఉద్యమాన్ని అణచలేరన్నారు. వెంటనే యాజమాన్యం నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ సిటు గౌరవాధ్యక్షుడు జె. అయోధ్యరామ్, అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వై.టి.దాస్, యు.రామస్వామి, అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు కె.ఎస్.ఎన్.రావు, రమణమూర్తి, డి.వి.రమణారెడ్డి, దొమ్మేటి అప్పారావు, డి. సురేష్‌బాబు, రామ్‌కుమార్, రామ్మోహన్‌కుమార్, పరంధామయ్య, డేవిడ్ తదితరులు యాజమాన్యం వైఖరిని నిరసించారు.
వెంటనే ఉపసంహరించుకోవాలి
ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల
డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment