అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుల వెల్లువ
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జీవీఎంసీలో నిర్వహించారు. పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ జోన్లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తితో కలిసి నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించారు. మొత్తం 90 వినతులు రాగా..అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 50 ఫిర్యాదులు అందాయి. నిర్ణీత సమయంలో వీటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను మేయర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ సోమన్నారాయణ, ప్రధాన ఇంజినీరు శివప్రసాద్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు.
జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 90 వినతులు
Comments
Please login to add a commentAdd a comment