
ఏయూలో టెక్నో కల్చరల్ ఫెస్ట్
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘రీబూట్–2కే25’పేరిట రెండు రోజుల పాటు నిర్వహించనున్న టెక్నో కల్చరల్ ఫెస్ట్ సోమవారం ప్రారంభమైంది. ఇంజినీరింగ్ విద్యార్థులు శసాంకేతిక అంశాల్లో నైపుణ్యత సాధించేలా సదస్సు నిర్వహిస్తున్నట్లు కాలేజీ ఫ్రిన్సిపాల్ ఆచార్య ఆర్.పద్మశ్రీ తెలిపారు. ముఖ్య అతిఽథిగా హాజరైన మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి.మల్లేశ్వరి విద్యార్ధినులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, లైంగిక హింసలను ఎలా ఎదుర్కోవాలి, పోలీసుల సహాయం ఎలా తీసుకోవాలో వివరించారు. సీఎస్‌సీ అండ్ ఐటీ హెచ్‌వోడీ ఆచార్య బి.ప్రజ్ఙ, కో–ఆర్డినేటర్స్ డాక్టర్ బి.ఎస్తేర్ సునంద, ఎం.కుమారి, డాక్టర్ ఎస్.అరుణ, జి.శిరీష తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment