రేవిడి జట్లమ్మకు అరిసెలతో అలంకరణ
తగరపువలస: పద్మనాభం మండలం రేవిడి జట్లమ్మ అమ్మవారిని మంగళవారం అక్కడి ఆలయ కమిటీ ప్రతినిధులు అరిసెలు, సున్నిపాకుండలు, పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించారు. మరగడ నాగ, కుమారి, ఇషితరెడ్డి ఈ అలంకరణకు సహాయ సహకారాలు అందించారు. అలాగే భీమిలి మండలం మజ్జివలస గ్రామదేవత రాస పోలమాంబ అమ్మవారిని ఆలయ కమిటీ ప్రతినిధులు కొబ్బరికాయలు, పువ్వులతో అలంకరించారు. గ్రామానికి చెందిన నీలాపు సూర్యనారాయణ, అనసూయ దంపతులు ఈ అలంకరణకు సహాయ సహకారాలు అందించగా.. తుపాకుల అప్పల రాసయ్య, రాసమ్మ దంపతులు భక్తులకు ప్రసాదాలు అందించారు.
రేవిడి జట్లమ్మకు అరిసెలతో అలంకరణ
Comments
Please login to add a commentAdd a comment