జూలో వన్యప్రాణులకు బర్డ్ ఫ్లూ దెబ్బ
ఆరిలోవ: బర్డ్‌ఫ్లూ వ్యాధి ప్రభావం జూలో వన్యప్రాణులపై పడింది. రోజూ చికెన్ తినే జంతువులు, పాములకు సుమారు నెల రోజులకు పైగా ఆహారం మారిపోయింది. చికెన్ రుచి తగలకపోవడంతో పాపం వన్యప్రాణులు వేరే రుచికి అలవాటుపడేందుకు ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ పులులు, సింహాలు, హైనాలు, చిరుతలు తదితర వాటికి బీఫ్‌తో పాటు చికెన్ కూడా రోజూ ఆహారంగా వేస్తారు. పాములకు కోడి పిల్లల్ని అందిస్తారు. బర్డ్ ఫ్లూ వల్ల సీజెడ్‌ఏ అధికారుల ఆదేశాలతో వన్యప్రాణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆహారం అందిస్తున్నట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. ఆయా జంతువులకు చికెన్‌కు బదులుగా ప్రస్తుతం పంది మాంసం(ఫోర్క్), పాములకు కోడి పిల్లలకు బదులుగా కుందేళ్ల పిల్లలు(చిన్నవి) ఆహారంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment